దంచికొట్టిన సూర్య‌, య‌శ‌స్వీ..భారత్ భారీ స్కోర్

శ్రీలంకతో తొలి టీ20లో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్‌గా సూర్య‌కుమార్ యాద‌వ్ అర్ధ శ‌త‌కంతో విరుచుకుప‌డ్డాడు.

srilaka
X

శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ప‌ల్లెకెలె స్టేడియంలో లంక బౌల‌ర్ల‌ను భార‌త్ బ్యాటర్ల దంచికొట్టడంతో 213 ప‌రుగులు చేసింది. కెప్టెన్‌గా పస్ట్ మ్యాచ్‌లోనే సూర్య‌కుమార్ యాద‌వ్(58 :26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ శ‌త‌కంతో విరుచుకుప‌డ్డాడు. వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోలు రిష‌భ్ పంత్‌(49), ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(44)లు సైతం వీర‌విహారం చేయ‌డంతో టీమిండియా నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 213 ర‌న్స్ కొట్టింది.టాస్ ఓడిన టీమిండియాకు యువ ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(40), శుభ్‌మ‌న్ గిల్(34)లు అదిరే అరంభ‌మిచ్చారు.

తొలి ఓవ‌ర్ నుంచే లంక బౌల‌ర్ల‌ను చీల్చిచెండాడుతూ బౌండ‌రీల వ‌ర్షం కురిపించారు. ఇద్ద‌రూ పోటాపోటీగా బౌండ‌రీలు కొట్ట‌డంతో స్కోర్ బోర్డు ప‌రుగ‌లు పెట్టింది. 5 ఓవ‌ర్లకే స్కోర్ 50 దాటింది. అయితే.. దిల్షాన్ మ‌ధుశ‌న‌క వేసిన ప‌వ‌ర్ ప్లే ఆఖ‌రి ఓవ‌ర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాది చివ‌రి బంతికి క్యాచ్ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 74 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. అనంత‌రం బంతి అందుకున్న వ‌నిందు హ‌స‌రంగ‌ డేంజ‌ర‌స్ య‌శ‌స్వీని బోల్తా కొట్టించాడు. లంక బౌలర్లలో పతిరణ 4 వికెట్లతో విజృంభించారు. హసనరంగ , మధుశంక, ఫెర్నాండో తలో వికెట్ తీశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story