ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు

చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్‌ కేసులో నమోదు చేశారు.

ఆరుగురు అధికారులపై క్రిమినల్‌ కేసులు
X

చెరువుల్లో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు చేపట్టారు. హైడ్రా ఫిర్యాదుతో ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్‌ కేసులో నమోదు చేశారు. నిజాంపేట మున్సిపల్‌ కమిషనర్‌ రామకృష్ణ, చందాపేట జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ సుదామ్ష్‌, బాచుపల్లి తహసీల్దార్‌ పూల్‌సింగ్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, హెచ్‌ఎండీఏ అసిస్టెంట్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ సుధీర్‌ కుమార్‌, హెచ్‌ఎండీఏ సిటీ ప్లానర్‌ రాజ్‌కుమార్‌పై కేసులు నమోయ్యాయి.

చెరువు తూములు బంద్‌ చేసి అపార్ట్‌మెంట్‌ నిర్మాణం

హైదరాబాద్‌ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పాదం మోపుతున్నది. చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధి, బఫర్‌ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్నది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పటాన్‌చెరులో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువును పరిశీలించారు. అక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్‌ చేసి ఇన్‌కోర్‌ సంస్థ అపార్ట్‌మెంట్‌ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్ట్‌మెంట్‌ను హైడ్రా కమిషనర్‌ పరిశీలించారు.

జగన్‌కు నోటీసులు అవాస్తవం

వైసీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందనే ప్రచారంపై రంగనాథ్‌ స్పందించారు. సోషల్‌ మీడియాలో వస్తున్నవి అవాస్తవాలని కొట్టిపారేశారు.

Raju

Raju

Writer
    Next Story