విదేశీ పర్యటనలో రూ.31,500 కోట్ల ఒప్పందాలు : శ్రీధర్ బాబు

విదేశీ పర్యటనలో మొత్తం 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Sridhar1
X

సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో విదేశీ పర్యటనలో మూసీ సుందరీకరణపై వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో చర్చించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 19 సంస్థలతో రూ.31,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని మంత్రి అన్నారు. వీటి వల్ల 30వేల ఉద్యోగాలు అవకాశం ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. దక్షిణ కొరియాలో 12 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ పర్యటన వల్ల కాగ్నిజెంట్, ఆర్ అండ్ డీ వంటి సంస్థల విస్తరణ ప్రత్యక్షంగా చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక కార్నింగ్ వంటి సంస్థలు తెలంగాణను విడిచి పోతున్నాయని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్నింగ్ సంస్థలతో చర్చలు జరిపామని వారు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో అమెజాన్ లాంటి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు

Vamshi

Vamshi

Writer
    Next Story