కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిమనిషి దారుణ హత్య

గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేసే పనిమనిషి శనివారం దారుణ హత్యకు గురైంది

Asam begum
X

హైదరాబాద్ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పని చేసే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్‌లో ఆసిఫ్ నగర్ ప్రాంతంలో ఉండే మహమ్మద్ హసన్ అనుమానంతో తన భార్య అస్మా బేగంను కత్తితో పొడిచి చంపాడు. ఎవరికి తెలియకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వచ్చి అతడిని ఆపి నిలదీయడంతో మృతదేహం చెత్త డబ్బాలో దొరికింది అని చెప్పుకొచ్చాడు.

దీంతో అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడు మహమ్మద్ హసన్ విచారింగా .. అనుమానంతో తన భార్య ఆస్మా బేగంను కత్తితో పొడిచి చంపినట్లు భర్త ఒప్పుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.కాగా ఆస్మా హత్య విషయం తెలుసుకున్న ఫిరోజ్ ఖాన్ హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.


Vamshi

Vamshi

Writer
    Next Story