కాంగ్రెస్‌ అంటేనే.. దోఖా పార్టీ: హరీశ్‌

ఢోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం దోఖా ఇచ్చిందని అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు.

కాంగ్రెస్‌ అంటేనే.. దోఖా పార్టీ: హరీశ్‌
X

ఢోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం దోఖా ఇచ్చిందని అసెంబ్లీలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు.ఎనిమిది నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసిందో ఏకరువు పెట్టారు.

ప్రతి మహిళలకు నెలకు 2500 ఇస్తామన్నారు, రైతు భరోసా కింద రైతన్నకు 15 , కౌలు రైతుకు 12 వేలు, డిసెంబర్ 9 న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అన్ని పంటలకు మద్దతు ధరపై 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు,మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని, 25 వేల పోస్టులలో మెగా డీఎస్సీ, వంద రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు అన్నరు, నిరుద్యోగ భృతి, వెంటనే డీఏ, పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ, ఉద్యోగులు ఉపాధ్యాయులకు, ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం, మైనార్టీలకు ప్రత్యేక సబ్ ప్లాన్, అవ్వా, తాతలకు 4వేల పింఛన్, దివ్యాంగులకు 6వేల పింఛన్ ఇస్తామని చెప్పారు. కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, ఆటో డ్రైవర్లకు 12 వేల ఆర్థిక సాయం, ప్రతి రోజూ సీఎం ప్రజాదర్బార్ నిర్వహిస్తారని చెప్పారు. కానీ ఈ ఎనిమిది నెలల ఇవేవీ అమలు చేయకుండా దోఖా చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటేనే పెద్ద దోఖా పార్టీ అని విమర్శించారు.

హరీశ్‌ రావు ప్రభుత్వ వైఫల్యాలను, బడ్జెట్‌లో చేసిన అంకెల గారడీపై మాట్లాడుతుండగా మంత్రి కోమటిరెడ్డి ఇష్యూను డైవర్ట్‌ చేయడానికి ప్రయత్నించారు. దీనిపై స్పందిచిన హరీశ్‌ మంత్రికి హాఫ్‌ నాలెడ్జ్‌ అన్నారు. ఆర్థిక మంత్రి భట్టి బడ్జెట్‌లో చేసిన అంకెలపై ఆయనకు అవగాహన లేదని ఎద్దేవా చేశారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి కోమటిరెడ్డి ఆకారం పెరిగింది కానీ బుద్ధి లేదు అన్నారు. దీనిపై హరీశ్‌ మాట్లాడుతూ.. ఆయనకు గట్టిగా సమాధానం చెప్పే దమ్ము నాకున్నదని కానీ సమస్యను పక్కదోవ పట్టించి సమయం వృథా చేయదలుచుకోలేదన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో కేటాయింపులు పెంచారని, కానీ అసలు బడ్జెట్ లో కేటాయింపులు తగ్గించారని హరీశ్‌ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

Raju

Raju

Writer
    Next Story