హరీశ్‌ను రాజీనామా చేయమనే హక్కు కాంగ్రెస్‌కు లేదు: దేవీ ప్రసాద్‌

కొడంగల్ లో 2018 లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అని ప్రక్రించి మాట తప్పిన రేవంత్ రెడ్డి. అలాంటి ఆయన హరీష్ రావు పారిపోతాడని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని దేవీ ప్రసాద్‌ విమర్శించారు.

హరీశ్‌ను రాజీనామా చేయమనే హక్కు కాంగ్రెస్‌కు లేదు: దేవీ ప్రసాద్‌
X

ఆరు గ్యారంటీల ను వంద రోజులలో అమలు చేస్తామని, రూ. 2 లక్షల వరకు సంపూర్ణ రుణ మాఫీ రైతులందరికీ డిసెంబర్ 9 న అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను వంచించిందని బెవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ దేవీప్రసాద్ విమర్శించారు.ఆరు గ్యారెంటీలకు మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన రాహుల్ గాంధీ మాటలు బుట్ట దాఖలయ్యాయి. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు కాలేదన్నారు.

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆగస్ట్ 15 లో గా అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నాన్ని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎండగట్టారు. ప్రజల పక్షం వహించి ఆరు గ్యారెంటీ ల తో పాటు 2 లక్షల రుణ మాఫీ చేయాలని లేకపోతే సీఎం రాజీనామా చేయాలని అమలుచేస్తే తాను రాజీనామా చేస్తామని ప్రకటించారు.నాడు ఛాలెంజ్ కు ముఖ్య మంత్రి ముందు కు రాలేదు. కానీ నేడు ఒక లక్ష వరకు కొందరికి మాత్రమే రుణమాఫీ చేసి కాంగ్రెస్ సంబరాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదన్నారు.

ఇంకా 25 వేల కోట్ల రుణ మాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేయకుండా హరీశ్ రావును రాజీనామా చేయాలని సీఎం తో పాటు ఇతర నాయకులు డిమాండ్ చేయడం ఆయన పట్ల వారికి ఉన్న అక్కసు తెలియచేస్తుంది. కొడంగల్ లో 2018 లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అని ప్రక్రించి మాట తప్పిన రేవంత్ రెడ్డి. అలాంటి ఆయన హరీష్ రావు పారిపోతాడని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం అనేక సార్లు పదవులకు రాజీనామా చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ పార్టీది. ఇప్పటికైనా ఎదురు దాడి ఆపి ప్రజలకిచ్చిన హామీలు ఎలాంటి కోతలు లేకుండా అమలు చేసే ప్రయత్నం చేయండి. అనేక హామీలు ఇచ్చి ఒకటిరెండు అమలుచేసి అన్నీ అమలు చేసామనే దబాయింపు ఇకనైనా ఆపండి అని కాంగ్రెస్‌ నేతలకు సూచించారు. ప్రజలకు ప్రభుత్వం హామీలు అమలుచేసే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.

Raju

Raju

Writer
    Next Story