కాంగ్రెస్‌ వచ్చింది.. నీటి కష్టాలు మళ్లీ మొదలైనయ్‌

సంగారెడ్డి జిల్లాలో తాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్‌ వచ్చింది.. నీటి కష్టాలు మళ్లీ మొదలైనయ్‌
X

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలకు తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా వట్‌ పల్లి మండలం మేడికుండతండాలో 15 రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని, దీంతో అక్కడి ప్రజలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తండా సమీపంలోని కుంటకు వెళ్లి బిందెలతో నీళ్లు మోసుకొచ్చుకుంటున్నారని తెలిపారు. ఆ కలుషిత నీటిని తాగి ప్రజలు విష జ్వరాలతో ఆస్పత్రుల పాలవుతున్నారని తెలిపారు. మిషన్‌ భగీరథ నుంచి నీళ్లు ఇవ్వాలని అధికారులను వేడుకున్నా పట్టించుకోవడం లేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్‌ స్పందించి తండావాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని కోరారు. తండావాసులు సమీపంలోని కుంట నుంచి నీటిని మోసుకొస్తున్న వీడియోలను తన ట్వీట్‌ కు జత చేశారు.

Next Story