వేం నరేందర్‌రెడ్డి పేరుతో వసూళ్లు..అలర్ట్‌ అయిన సలహాదారుడు

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. అతని పేరు వాడుకుని కేటుగాళ్లు ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారు.

VEM
X

సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. అతని పేరు వాడుకుని ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారు. ఇటీవల కొందరు వ్యక్తులు నరేందర్ రెడ్డి పేరు ఉపయోగించి డబుల్ బెడ్ రూమ్‌లు ఇప్పిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కేటుగాళ్లు డబ్బులు వసూలు చేశారు.

దీనిపై అలర్ట్‌ అయిన వేం నరేందర్ రెడ్డి…కీలక ప్రకటన చేశారు. ఎవరైనా తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని కోరారు. తన పేరుపై ఫైరవీలు చేస్తామని చెబితే ఫోన్ నెం. 7566663335 సంప్రదించాలని సూచించారు. ఇటీవల వసూలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story