సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు ఆన్లైన్లోనే
సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఇక నుంచి ఆన్లైన్లోనే స్వీకరించనున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధికారిక వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి ఈ వెబ్ సైట్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నారు.
- By RajuLoading...
- | 3 July 2024 3:31 AM GMT
X
ముఖ్యమంత్రి సహాయ నిధి( సీఎంఆర్ఎఫ్) దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 15 నుంచి ఈ వెబ్ సైట్ ద్వారానే దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణల నేపథ్యంలో పారదర్శకతతో నిర్వహించాలన్న సీఎం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను https://cmrf.telangana.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖ జతచేసి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు దారు బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్కు సంబంధించి ఒక కోడ్ కేటాయిస్తారు. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సెక్రటేరియట్లో అందజేయాలి. దరఖాస్తులను సంబంధిత ఆస్పత్రులకు పంపించి నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే సీఎంఆర్ఎఫ్ను ఆమోదించి చెక్‌ను సిద్ధం చేస్తారు. చెక్ పక్కదారి పట్టే అవకాశం లేకుండా దరఖాస్తు దారుడి అకౌంట్‌ను ముద్రిస్తారు. సిఫార్సు చేసిన ప్రజాప్రతినిధులు చెక్‌ను దరఖాస్తు దారులకు అందజేస్తారు.