నిరుద్యోగుల హామీలను నెరవేర్చని.. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి : జడ్సన్‌

రేపు తెలంగాణ బంద్‌కు పిలుపు నిచ్చారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్‌.

Bakka jadasan
X

సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్‌ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల డిమాండ్ పరిష్కరానికై దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్మించేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేంటనే రాజీనామా చేయాలని జడ్సన్‌ డిమాండ్ చేశారు.

ఇక అటు డీఎస్సీ వాయిదా వేయాలంటు గాంధీ హాస్పిటల్ వద్దకు వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఓయూలో నిరుద్యోగులు నిరసనకు దిగారు. గ్రూప్-1 మెయిన్స్ ఎలిజిబిలిటీ 1:100కు పెంచాలని… గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3000 ఉద్యోగాలు కలపాలని డిమాండ్‌ చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి… 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలిని నిరుద్యోగులు డిమాండ్ చేస్తు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story