రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

రీజనల్ రింగ్ రోడ్డుపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.

రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
X

రీజనల్ రింగ్ రోడ్డుపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపుపై ఎన్ హెచ్ఏఐ దృష్టి సారించింది. ఇప్పటికే కీలకమైన అటవీ అనుమతుల కోసం కేంద్రానికి దరఖాస్తులు చేయగా త్వరలోనే ఆమోదం రానున్నట్లు తెలుస్తున్నది. మరో వైపు ఈ రీజనల్ రింగ్ రోడ్డుపై కేంద్రం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నది.

ఈ ప్రాజెక్టును రహదారుల కార్యాచరణ ప్రణాళికలో చోటు కల్పించింది. ఈ నిర్ణయంతో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరగనున్నాయి. భూ సేకరణపై సీఎం చర్చించారు. ఆర్ఆర్ఆర్‌ను రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Vamshi

Vamshi

Writer
    Next Story