సియోల్‌లో సీఎం రేవంత్‌ బీజీబీజీ.. రేపు రాష్ట్రానికి రాక

సీఎం రేవంత్‌ విదేశీ పర్యటన నేటితో ముగియనున్నది. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందం సుమారు 50 పైగా బిజినెస్‌ మీటింగ్‌లు, మూడు రౌంట్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నది.

సియోల్‌లో సీఎం రేవంత్‌ బీజీబీజీ.. రేపు రాష్ట్రానికి రాక
X

పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనున్నది. అమెరికాలోనే దాదాపు 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌తో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. శాంసంగ్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, జీఎస్‌ కల్టెక్స్‌, సెల్‌ ట్రాయన్‌ ప్రతినిధులతోనూ సీఎం చర్చించనున్నారు.

మూసీ పునరుద్ధరణ కోసం నిన్న రాత్రి సీఎం బృందం దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్‌గేచంగ్‌ నదీ పరిసరాలను సీఎం రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. నదిని ప్రపంచస్థాయి వాటర్‌ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నులను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పై అనేక ఆలోచనలకు అవకాశం ఇచ్చిందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. హన్‌ రివర్‌ ఫ్రంట్‌ సందర్శించి సియోల్‌ డిప్యూటీ మేయర్‌తోనూ భేటీ కానున్నారు. కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనున్నది. దక్షిణ కొరియా పర్యటన ముగించుకుని సింగపూర్‌ మీదుగా రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు.

ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి బృందం సుమారు 50 పైగా బిజినెస్‌ మీటింగ్‌లు, మూడు రౌంట్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నది. వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌లో వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో కొరియా పెట్టుబడులు పెట్టడానికి అక్కడి టెక్స్‌టైల్‌ ఫెడరేషన్‌ సానుకూలత వ్యక్తం చేసింది. కొరియాలోని అతి పెద్ద పారిశ్రామిక వ్యవస్థల్లో ఒకటైన ఎల్‌ఎస్‌ గ్రూప్‌ఛైర్మన్‌ కు-జాఉన్‌తో సీఎం భేటీ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాత ఎల్జీ గ్రూప్‌ వ్యవస్థాపకులైన కుటుంబాన్ని కలవడంతోనే కొరియా పర్యటన ప్రారంభం కావడం పట్ల సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ కేబుల్స్ , బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ తదితర రంగాల్లో తెలంగాణలో పెట్టుబడుల విస్తరణకు ఎల్ఎస్ గ్రూప్ ఆసక్తి కనబర్చింది.

Raju

Raju

Writer
    Next Story