కోల్‌కతాలో నిరసన ప్రదర్శన చేపట్టిన సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Mamatha
X

కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనను నిరసిస్తూ శుక్రవారం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో నిరసన ప్రదర్శన ప్రారంభించారు. ఆర్‌జీ కార్‌ వైద్యశాల వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. ట్రైయినీ డాక్టర్ హత్యాచార ఘటన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆదివారంలోగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ పూర్తి చేయాలని ఆమె అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా గత ఏడు రోజులుగా వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళన చేపడుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలండూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా నిరసన ప్రదర్శన ప్రారంభించారు. లైంగికదాడి, హత్యకు గురైన వైద్యురాలికి న్యాయం చేయాలంటూ కోల్‌కతాలో నిరసన ప్రదర్శన ప్రారంభించారు.

ఆర్‌జీ కార్‌ వైద్యశాల వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. లైంగికదాడి ఘటన నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకే చెందిన కొందరు జూనియర్ వైద్యుల, సీనియర్ డాక్టర్ల పాత్ర ఈ దురాగతంలో ఉందని జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు చెప్పినట్లు టాక్. వారందరి పేర్లు, ఇతర వివరాలను కూడా సీబీఐకి అందజేసినట్లు సమాచారం. ఈక్రమంలోనే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీకి చెందిన ఇద్దరు వైద్యాధికారులు, ముగ్గురు జూనియర్ డాక్టర్లు, జూనియర్ వైద్యురాలికి పోస్టుమార్టం నిర్వహించిన ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యనిపుణులకు సీబీఐ సమన్లు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 30 మందిని ప్రశ్నించేందుకు సీబీఐ టీమ్ సిద్దం అవుతోందని అధికార వర్గాలు తెలిపాయి. తాజాగా శుక్రవారం కూడా ఆస్పత్రికి చెందిన ఒక ఉద్యోగికి, ఇద్దరు పీజీ ట్రైనీ డాక్టర్లకు సీబీఐ సమన్లు జారీ చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story