స్కిల్‌ యూనివర్సిటీ వర్సిటీ నిర్మాణానికి సీఎం శ్రీకారం

స్కిల్‌ యూనివర్సిటీ వర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.

Skill Univercity
X

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సీఎం కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. వర్సిటీతోపాటు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌, ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లకు కూడా శంకుస్థాపన చేశారు.

తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణంపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. యూనివర్సిటీతోపాటు మరో 4 ప్రధాన కేంద్రలను ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఓఆర్‌ఆర్, ఎయిర్ పోర్టులతో హైదరాబాద్‌లో రూపరేఖలు మారిపొయాయి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో భుముల విలువ పెరిగిందని సీఎం అన్నారు.ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్‌ బాబు, సీఎస్ శాంతి కుమారి పాల్గోన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story