‘అన్న క్యాంటీన్‌’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. అనంతరం స్వయంగా పేదలకు అన్నం వడ్డించి.. సీఎం దంపతులు భోజనం చేశారు.

CBN
X

కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రారంభించారు. అనంతరం స్వయంగా పేదలకు అన్నం వడ్డించి.. సీఎం దంపతులు భోజనం చేశారు. అక్కడ వసతులను వసతులను పరిశీలించారు. తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ క్యాంటీన్లలో మూడు పూటలా కలిపి రోజూ 1.05 లక్షల మంది పేదలకు ఆహారం సరఫరా చేయనున్నారు. ఉదయం 35 వేల మందికి అల్పాహారం, మధ్యాహ్నం 35 వేలు, రాత్రి మరో 35 వేల మందికి ఆహారం అందించనున్నారు.

ఒక్కొక్కరి నుంచి పూటకు రూ.5 మాత్రమే ధర వసూలు చేయనున్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలు రూ.5 లకే కడుపు నింపుకోవచ్చని, ఇది బృహత్తర కార్యక్రమమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భువనేశ్వరి బుధవారం రూ. కోటి విరాళం అందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అన్నదానికి తొలిసారి శ్రీకారం చుట్టింద మాజీ సీఎంఎన్టీ రామారావు అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతిలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. 2014-19 కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం రావడంతోనే వాటిని రద్దు చేశారని తెలిపారు. వైఎస్ పేరు పెట్టుకుని అన్నా క్యాంటీన్లు నడపాలని విజ్ఞప్తి చెప్పినా జగన్ వినలేదని చెప్పారు.

ప్రభుత్వం ఒప్పుకోకపోయినా దాతల సాయంతో నడుపుతామని చెప్పినా జగన్ అనుమతించలేదని తెలిపారు.సెప్టెంబర్ చివరి వరకూ 203 అన్న క్యాంటీన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తద్వారా పేదలకు రూ. 5కే భోజనం పెడతామన్నారు. అన్న క్యాంటీన్ల నిర్వహణకు హరేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, తనకు చాలా సంతోషంగా ఉందని బాబు అన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story