మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కిట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ మెడిటేక్ జోన్ అభివృద్ధి చేసిన ఆర్టిపిసిఆర్ కిట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మెడిటేక్ తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నిస్టిక్స్ ప్రైవేట్ లిమిడ్‌తో కలిసి దీన్ని రూపొందించారు.

మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కిట్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
X

మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ మెడిటేక్ జోన్ అభివృద్ధి చేసిన ఆర్టిపిసిఆర్ కిట్‌ను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. మెడిటేక్ తమ భాగస్వామి ట్రాన్సేషియా డయాగ్నిస్టిక్స్ ప్రైవేట్ లిమిడ్‌తో కలిసి దీన్ని రూపొందించారు. పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడిటేక్ జోన్ లో ఆర్టిపిసిఆర్ కిట్ ని అభివృద్ధి చేయడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. ప్రపంచ వేదికపై మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఘనంగా చాటుతుందన్నారు. ఈ కిట్ తయారీ బృందాన్నిముఖ్యమంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా ఆర్టీపిసిఆర్ కిట్ ను సీఎం చంద్రబాబు తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కిట్ ని తక్కువ ధరతో త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెడిటేక్ ప్రతినిధులు తెలిపారు. ఇక కార్మికులకు త్వరలోనే పది లక్షల బీమా పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం పేర్కొన్నారు. చంద్రన్న బీమాను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.. భీమా పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని అన్నారు. పరిశ్రమల భద్రత అంశంలో రాజీ పడవద్దు అన్నారు చంద్రబాబు. భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ చేయించాలని అధికారులను ఆదేశించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story