విజయవంతంగా కొనసాగుతున్న స్వచ్ఛదనం- పచ్చదనం పనులు

మూడు రోజుల్లో 25 లక్షల మొక్కలు నాటారు. 29 వేల కిలోమీటర్ల రోడ్లను శుభ్రం చేశారు. 18 వేల కిలోమీటర్లకు పైగా డ్రైనేజీలను శుద్ధి చేశారు.

విజయవంతంగా కొనసాగుతున్న స్వచ్ఛదనం- పచ్చదనం పనులు
X

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీ కాలువలను, రోడ్లను క్లీన్‌ చేశారు. మంత్రుల నుంచి సామాన్య ప్రజల దాకా, కలెక్టర్ల నుంచి పంచాయతీ కార్యదర్శులు దాకా అధికారులు, ప్రజలు ఉత్సాహంగా ఈ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొంటున్నారు. గ్రామపంచాయతీ నుంచి పట్టణం దాకా అన్ని స్థాయిల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సోమవారం నాడు స్వచ్ఛదనం - పచ్చదనం ప్రారంభమవగా బుధవారం సాయంత్రం వరకు 25.55 లక్షల మొక్కలను నాటారు. 29, 102 కిలోమీటర్ల మేర రోడ్లను క్లీన్‌ చేశారు. 18,599 కిలోమీటర్ల డ్రైనేజీ కాల్వలను శుద్ధి చేశారు. 50 వేల ప్రభుత్వ స్థలాలు కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. నీళ్లు నిలవకుండా 11, 876 లోతట్టు ప్రాంతాలను గుర్తించి చదును చేశారు.ఈ కార్యక్రమం మరో రెండు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది

Raju

Raju

Writer
    Next Story