ప్రారంభమైన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష

దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభమైంది. 1056 ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

ప్రారంభమైన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష
X

దేశవ్యాప్తంగా యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రారంభమైంది. 1056 ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు పేపర్‌-2 జరగనున్నది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కల్పించారు.

Also Read - ఎన్‌టీఏ డైరెక్టర్‌కు ఉద్వాసన.. నీట్‌ యూజీ పై సీబీఐ దర్యాప్తు

పెద్ద ఎత్తున దరఖాస్తులు.. హాజరయ్యేది 50 శాతం లోపే

ప్రిలిమ్స్‌ కు ఏటా పెద్ద ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నారు. కానీ వారిలో పరీక్షకు హాజరయ్యేవారు సగం మందే ఉంటున్నారని యూపీఎస్సీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు 2020లో 10.57 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 4.82 లక్షల మంది, 2021లో 10.93 లక్షలకు 5.08 లక్షలు, 2022లో 11.35 లక్షలకు 5.37 లక్షల మంది హాజరయ్యారు. ఇక గత ఏడాది 13 లక్షల మంది దరఖాస్తు చేయగా 5.30 లక్షల మంది పరీక్ష రాశారు.

Raju

Raju

Writer
    Next Story