చంపై సోరెన్ కొత్త రాజకీయ పార్టీ

వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ తెలిపారు.

Champai
X

ఝర్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం నేత చంపై సోరెన్ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు అవకాశాల గురించి నేను ప్రస్తావించా. పదవీ విరమణ, నూతన పార్టీ లేదా వేరే పార్టీలో చేరిక. నేను పదవీ విరమణ చేయను. కొత్త పార్టీని బలోపేతం చేస్తా. మంచి స్నేహితుడిని కలిస్తే వారితో కలిసి ముందుకు సాగుతా’ అని అన్నారు. గత కొద్ది రోజులుగా ఆయన జేఎంఎంను వీడి బీజేపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ కారణంగానే ఆయన ఢిల్లీకి వెళ్లారని.. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు సైతం ఢిల్లీకి వెళ్లారనే ప్రచారం సాగింది.

తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం అంకితం చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) లో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని చంపై సోరెన్ ఆరోపించారు.ముఖ్యమంత్రిగా తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తనకు చెప్పకుండా రద్దు చేయడం చాలా అంసతృప్తిని కలిగించిందని చెప్పారు. తనకు అధికారంపై అత్యాశ లేదని, అందుకే ఆత్మగౌరవం దెబ్బతినే వరకు మౌనంగా ఉన్నానని అన్నారు. అయితే చాలా అవమానాల తరువాత ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకవలసి వచ్చిందని తెలిపారు. ‘ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని అన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story