కేంద్ర పన్నుల్లో ఏపీకి భారీగా.. తెలంగాణకు స్వల్పంగా

2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం 12,47, 211.28 కోట్ల పన్నుల వాటాను పంచనున్నది. అందులో 4.047 శాతం ఏపీకి దక్కున్నది. ఏపీకి 50, 474.64 కోట్లు, తెలంగాణకు రూ. 26,216 కోట్లు అందనున్నాయి.

కేంద్ర పన్నుల్లో ఏపీకి భారీగా.. తెలంగాణకు స్వల్పంగా
X

2024-25 ఆర్థిక సంవత్సరానికి అన్ని రాష్ట్రాలకు కలిపి కేంద్రం 12,47, 211.28 కోట్ల పన్నుల వాటాను పంచనున్నది. అందులో 4.047 శాతం ఏపీకి దక్కున్నది. ఏపీకి 50, 474.64 కోట్లు, తెలంగాణకు రూ. 26,216 కోట్లు అందనున్నాయి.

గత ఏడాది కంటే ఏపీకి రూ. 5.776 కోట్లు (12.92 శాతం) అధికం. ఫిబ్రవరిలో పెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 49,364.61 కోట్లతో పోలిస్తే ఇది రూ. 1,110 కోట్లు అధికం. ఏపీకి అత్యధికంగా ఆదాయ పన్ను నుంచి 17,455.93 కోట్లు దక్కనుండగా.. తర్వాత కార్పొరేట్‌ టాక్స్‌ కింద 15,156.56 కోట్లు, సీజీఎస్‌టీ 15,079.39 కోట్ల, కస్టమ్స్‌ కింద రూ.2,228.46 కోట్లు , ఎక్సైజ్‌ ట్యూటీ కింద 469.73 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ కింద 1.66 కోట్లు,ఇతర పన్నులు, సుంకాల కింద రూ. 82.36 కోట్లు రానున్నది.

కేంద్ర పన్నుల్లో తెలంగాణకు 26,216 కోట్లు అందనున్నాయి. ఇది గత బడ్జెట్‌ కంటే రూ. 3,000 కోట్లు అధికం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో చూపెట్టిన లెక్కల కంటే 577కోట్లు అధికం. తెలంగాణకు ఆదాయపన్ను కింద రూ. 9,066.56 కోట్లు, కార్పొరేట్‌ పన్ను రూపంలో రూ. 7,872. 25 కోట్లు, సెంట్రల్‌ జీఎస్‌టీ కింద రూ, 7,832.19 కోట్లు, కస్టమ్స్‌ కింద రూ. 1,157.45 కోట్లు, ఎక్సైజ్‌ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సర్వీస్‌ ట్యాక్స్‌ రూ. 86 లక్షలు, ఇతర పన్నులు సుంకాల కింద రూ. 43 కోట్ల వాటా అందనున్నది.

Raju

Raju

Writer
    Next Story