కోల్‌కతా హత్యాచారం కేసులో సీబీఐ సంచలన విషయాలు

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ ఘటనలో గ్యాంగ్ రేప్ ఏమి జరిగిన ఆధారాలు ఏమీ లేవుని సీబీఐ తేల్చిచెప్పింది.

CBI
X

కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ సంచలన నిజాలను బయటపెట్టింది. ఈ ఘటనలో గ్యాంగ్ రేప్ ఏమి జరిగిన ఆధారాలు ఏమీ లేవుని సీబీఐ తేల్చిచెప్పింది. నిందితుడు సంజయ్‌రామ్ ఒక్కడే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు నిర్ధారించాయి. అలాగే దర్యాప్తు తుదిదశకు చేరుకుందని, త్వరలో కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. పోర్న్ వీడియోలను గుర్తించారు. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్‌ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది.

దాని ఆధారంగానే కేసు దర్యాప్తు సాగించినట్లు అధికారులు వెల్లడించారు. సంజయ్ రాయ్‌ను ఒక్కడే నిందితుడిగా గుర్తించినట్లు జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. కాగా ఈ కేసులో ఇప్పటికే ఆర్‌జీ కర్ ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్‌తో సహా 100కి పైగా మంది వాంగ్మూలాలను సీబీఐ నమోదు చేసింది. 10 మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది. ఇవన్నీ చేసిన అనంతరమే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదని నిర్ణయానికి వచ్చినట్టు ఆయా వర్గాలు చెబుతున్నాయి . ఆర్జీకర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ప్రిన్సిపల్ ను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story