పూజా ఖేడ్కర్‌ ఎంపిక రద్దు..జీవితకాల నిషేధం

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ సెలెక్షన్ ను యూపీఎస్సీ రద్దు చేసింది.

Pooja
X

మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఎంపికను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. భవిష్యత్తులో ఆమె సివిల్స్ పరీక్షలో పాల్గొనకుండా జీవితకాల నిషేధం విధించింది. ఫూజా ఖేద్కర్ పూణే ప్రొబేషనరీ సబ్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమెను టైం డిబర్ చేస్తున్నట్లు ప్రకటించింది. యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు ఆమెపై జులై 19న కేసు నమోదైంది. ట్రైనీ ఐఏఎస్‌గా ఉండగా అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో ఆమె వార్తల్లోకి ఎక్కారు. దీనిపై విచారణ జరిపిన యూపీఎస్సీ ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలంటే షోకాస్ నోటీసు ఇచ్చింది.

జూలై 25వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని యూపీఎస్‌సీ కోరగా, గడువు ఆగస్టు 4 వరకూ పొడిగించాలని ఆమె తిరిగి కోరారు. ఇందుకు యూపీఎస్‌సీ తిరస్కరిస్తూ జూలై 30 వరకూ అదనపు సమయం కల్పించింది. కానీ గడువులోగా ఆమె సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆమె ప్రొవెన్షియల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ, భవిష్యత్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయకుండా డిబార్ చేసినట్టు యూపీఎస్సీ ప్రకటించింది. నకిలీ పత్రాలతో పూజా ఖేడ్కర్ పరీక్షలు క్లియర్ చేయడం, తన పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామ వంటి పత్రాలను మార్చడం, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ సార్లు పరీక్షలు రాసినట్టు యూపీఎస్‌సీ గుర్తించింది. ఐపీసీలోని సెక్షన్ 420, 464, 465, 471, 89-91, 66డి కింద కేసులు నమోదు చేసింది.

Vamshi

Vamshi

Writer
    Next Story