BYD: పెట్టుబడులు పెడతామంటే నాడు తిరస్కరణ.. ఇప్పుడు ఆహ్వానం

చైనీస్ ఆటోమేకర్ BYD తెలంగాణలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎలక్ట్రిక్‌ కార్లు, బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తాన్న ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం తిరస్కరించడం, ఇప్పుడు ఆహ్వానించడంపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

BYD: పెట్టుబడులు పెడతామంటే నాడు తిరస్కరణ.. ఇప్పుడు ఆహ్వానం
X

ఏడాది కిందట చైనీస్ ఆటోమేకర్ BYD తెలంగాణలో బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి ఎలక్ట్రిక్‌ కార్లు, బ్యాటరీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నది. పెట్టుబడి ద్వారా వేలాది ఉద్యోగాలను సృష్టించడమే కాకుండా మన దేశంలో నూతన EV పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించాలనుకున్నది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

ఇప్పుడు, చైనా పెట్టుబడులు భారతదేశంలోకి ప్రవేశించడానికి, విస్తరించడానికి అనుమతించనున్నట్లు వార్తలు వింటున్నాము.ఏడాదిలో ఎంత మార్పు? కేంద్ర ప్రభుత్వం దీనిపై దయచేసి వివరించగలదా? అని ప్రశ్నించారు.

2023లో BYD ఫ్యాక్టరీ నెలకొల్పాలనుకున్నది. భారత్‌లో దీనిద్వారా ఎలక్ట్రిక్‌ కార్లు, బ్యాటరీలు తయారు చేయాలనుకున్నది. చైనీస్ ఆటోమేకర్ BYD భారత్‌లో కలిసి భాగస్వామ్యంతో ఒక బిలియన్‌ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ కేంద్రం ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

Raju

Raju

Writer
    Next Story