బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు సక్సెస్

విజయవాడ బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తియ్యిందని దిగువకు వరద ప్రవాహం ఆగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Budameneru
X

విజయవాడ బుడమేరు గండ్ల పూడ్చివేత పూర్తియ్యిందని దిగువకు వరద ప్రవాహం ఆగిపోయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. భారీ వర్షాలు పడిన మళ్లీ వరదలు రాకుండా కట్ట ఎత్తు పెంచుతామన్నారు. విజయవాడలో ఉన్న వరద నీరు క్రమంగా తగ్గుతోందని మంత్రి తెలిపారు. అవసరమేతే మోటార్లు పెట్టి నీటిని తొడిపోస్తామన్నారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60వేల క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు (బీడీసీకి) గండ్లు పడ్డాయి. మూడో గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా.. మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్‌ బెటాలియన్‌ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చి పనిలో పాల్గోన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story