పుష్ప-2 నుంచి బన్నీ కొత్త పోస్టర్ రిలీజ్
హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకూమార్ దర్శకత్వంలో పుష్ప-2 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ క్రమంలో బన్నీ కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- By VamshiLoading...
- | 28 Aug 2024 2:23 PM GMT
X
హీరో అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకూమార్ దర్శకత్వంలో పుష్ప-2 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ క్రమంలో బన్నీ కొత్త పోస్టర్ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. రెడ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ తో ఉన్న ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ సీరియస్ నెస్ ను చూడొచ్చు. 'పుష్ప-2: ది రూల్' చిత్రం మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది అంటూ మేకర్స్ నేడు అప్ డేట్ ఇచ్చారు. ఈ ఏడాది డిసెంబరు 6న థియేటర్లలో రిలీజ్ కానుంది అంటూ పేర్కొన్నారు. పుష్ప-2 చిత్రంపై బజ్ మామూలుగా లేదు.
పుష్ప సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో, సీక్వెల్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.సెకండ్ పార్ట్ లో ఫహాద్ ఫాజిల్ పాత్రపై అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన ట్రేడ్ మార్క్ సాంగ్స్ తో ఇప్పటికే ఆడియన్స్ లోకి పుష్ప-2పై మరింత క్రేజ్ క్రియేట్ చేశాడు. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీశ్ ప్రతాప్, ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. డిసెంబరు 6న పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప2: ది రూల్’ విడుదల కానుంది.