నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7-8 రోజులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు
X

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశంలో కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెడతారు. సభలో ఆమెకు నివాళులు అర్పిస్తారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత బడ్జెట్‌ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనేదాని అనే అంశంపై బిజినెస్‌ అడ్వజైరీ కమిటీ (బీఏసీ) సమావేశం స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అధ్యక్షతన జరుగుతుంది. శాసససభ నిర్వహణ తేదీ, అజెండాను ఇందులో ఖరారు చేస్తారు. బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం సుమారు 7-8 రోజులు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

25న సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశమౌతుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. అనంతరం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. గత డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తాత్కాలిక బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించింది. తాజాగా కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటంతో రాష్ట్ర ప్రభుత్వమూ అదే తీరును అనుసరిస్తున్నది. అధికార, విపక్షాల సవాళ్ల మధ్య ఈ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story