బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్

ఇది రైతు శత్రు ప్రభుత్వం. .బడ్జెట్ ఒట్టి డొల్ల - కేసీఆర్

బడ్జెట్ అంతా గ్యాస్.. ట్రాష్
X

బడ్జెట్‌లో ఏ ఒక్కరికీ భరోసా లేదని, రైతుభరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు. రైతులను మోసం చేయబోతున్నట్టు ప్రత్యక్షంగా చెప్పారు. బడ్జెట్ లోనూ కాంగ్రెస్‌ పార్టీ నైజం స్పష్టంగా బైటపడ్డదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీల్లుజల్లిందని, ప్రభుత్వం ప్రజల గొంతు కోసిందని కేసీఆర్‌ ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో దళితబంధు పథకం ప్రస్తావనే లేదని, దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? అని ప్రశ్నించారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని విమర్శించారు.

బడ్జెట్‌ ప్రసంగంలో కొత్తగా ఏమీ లేదని ఇందులో విశేషం ఏమిటంటే డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి పలకడం తప్పా ఏ ఒక్క కొత్తదేమీ లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్పా ఏ ఒక్క సంక్షేమ పథకం లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సి ఉండె. మేము లక్ష కోట్లు ఇస్తామని చెప్పారు. అవన్నీ రుణాలు, అవి కాంగ్రెస్‌ వాళ్లు ఇస్తున్నట్లుగా చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇది ఇప్పటికే ఉన్న పథకమని అందులో కొత్తదేమీ కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఆరు నెలల సమయం వాళ్లకు ఇవ్వాలని మేము అనుకున్నాం. కానీ ఈరోజు బడ్జెట్‌ చూస్తే ఏ ఒక్క పాలసీ అమలు జరగలేదు. రాష్ట్రానికి సంబంధించి ఈ అర్బక ప్రభుత్వం పాలసీని అమలు చేసినట్లు కనిపించడం లేదు.

వ్యవసాయానికి సంబంధించి మాకు స్పష్టమైన అవగాహన ఉండె. అందుకే రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. ఇప్పుడు కాంగ్రెస్‌ వాళ్లు ఎగ్గొడుతామని చెబుతున్నారు. మా హయాంలో రైతులకు ఇచ్చిన డబ్బును దుర్వినియోగం చేసినట్టు, చెడగొట్టామనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి ఈ ప్రభుత్వం రైతు శత్రు ప్రభుత్వమని తెలుస్తున్నది. ధాన్యం కొనుగోలు చేయడం, విద్యుత్‌, నీటి సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. రైతు భరోసా, రైతు బంధు గురించి ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తారని మా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడిగితే సమాధానం ఇవ్వరు. రైతులను, వృత్తి కార్మికులను ఈ ప్రభుత్వం వంచింది. ఒక్క పాలసీ గురించి నిర్దిష్ట విధానం లేదు. ఈస్ట్‌మన్‌ కలర్‌గా బడ్జెట్‌ ప్రసంగం స్టోరీ చెప్పినట్టు ఉన్నదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలు, ఇతర అనేక పాలసీలు అనే వాటిపై ఒక్కదానిపై నిర్దిష్ట విధానం లేకుండా గ్యాస్‌, ట్రాష్‌లా ఉన్నది. చిల్లమల్లర ప్లాట్‌ఫాం ప్రసంగంలా ఉన్నది తప్పా అది బడ్జెట్‌ ప్రసంగంలా లేదన్నారు. ఏ ఒక్క పాలసీకి సంబంధించి నిర్దిష్టంగా ఈ పనిని మేము ఇట్లా సాధిస్తామని, మా లక్ష్యాలు ఇవి అని పద్ధతి గాని, పద్దు గాని లేదు. ఇది పేదల బడ్జెట్‌ కాదు, రైతుల బడ్జెట్‌ కాదు. ఎవరి బడ్జెట్‌ అన్నది విశ్లేషణలతో తెలుస్తుంది. దీనిపై తాము అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామన్నారు.

Raju

Raju

Writer
    Next Story