ఆర్టీవీ, రవి ప్రకాశ్‌కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు

బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేసిన ఆర్టీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థకు, రవి ప్రకాశ్‌కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు

ఆర్టీవీ, రవి ప్రకాశ్‌కు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు
X

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని ఫేక్‌ వార్తలు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థకు, రవి ప్రకాశ్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్‌ నోటీసులు పంపింది.ఐదు రోజుల్లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని, విలీనం వార్తలను ఆర్టీవీ నెట్‌ వర్క్‌ వెంటనే తొలిగించాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నది. లేదంటే లీగల్‌ చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ తన నోటీసుల్లో పేర్కొన్నది.

గత పదేళ్ల నుంచి బీజేపీతో బీఆర్‌ఎస్‌ విభేదిస్తున్న విషయాన్ని నోటీసులో పేర్కొన్నది. కానీ ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని తెలిపింది. బీఆర్‌ఎస్‌పై ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారాలకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌లను నోటీసుల్లో పేర్కొన్నది.

Raju

Raju

Writer
    Next Story