షాద్‌నగర్ దళిత మహిళకి బీఆర్‌ఎస్ ఆర్థిక సాయం

షాద్‌నగర్‌లో పోలీసుల దాడిలో గాయపడిన దళిత మహిళకు బీఆర్‌ఎస్ నేతలు ఆర్థిక సాయం చేశారు.

BRS
X

షాద్‌నగర్‌లో పోలీసుల దాడిలో గాయపడిన దళిత మహిళకు బీఆర్‌ఎస్ నేతలు ఆర్థిక సాయం చేశారు. సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా పలువురు నాయకులు ఆమెను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. గతంలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోలేదని.. అందుకే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఘటనకు బాధ్యులైన ప్రతీ ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాము కూడా ఈ ఘటన పై మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఏడు నెలలుగా రాష్ట్రానికి హోం మంత్రి లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నాయని అన్నారు. మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజు ఎక్కడో కూడా అఘాయిత్యం జరుగుతున్న న్యూస్ చూస్తూనే ఉన్నామని అన్నారు. మహిళపై దాడి చేసిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story