నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌

నాలుగు రోజులుగా వరుసగా లాభాల బాటలో నడిచిన సూచీలకు అడ్డుకట్ట పడింది.

నాలుగు రోజుల లాభాలకు బ్రేక్‌
X

నాలుగు రోజులుగా వరుసగా లాభాల బాటలో నడిచిన సూచీలకు అడ్డుకట్ట పడింది. మైక్రోసాఫ్ట్‌ విండోస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన సంకేతిక సమస్యలతో విమాన-స్టాక్‌ మార్కెట్‌-బ్యాంకింగ్‌ రంగాల సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో మదుపర్లు కూడా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ డీలపడటం దీనికి తోడైంది.

సూచీల నష్టాలతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ శుక్రవారం ఒక్కరోజే రూ. 7.94 లక్షల కోట్లు తగ్గి రూ. 446.38 లక్షల కోట్లు (5.34 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.ఉదయం సెన్సెక్స్‌ 81,585.06 పాయింట్ల లాభాల్లోనే ప్రారంభమైంది. వెంటనే నష్టాలోకి వెళ్లిన సూచీ, అమ్మకాలు స్థిరంగా కొనసాగడంతో కోలుకోలేదు. ఒక దశలో 80,499.10 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి చివరికి 738.81 పాయింట్ల నష్టంతో 80,604.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 269.95 పాయింట్లు కోల్పోయి 24,530.90 దగ్గర స్థిరపడింది.

ఇక డాలర్‌ పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గి, జీవనకాల కనిష్ఠమైన 83.70 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 85 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story