భాగ్యనగర్‌లో బోనాల సందడి

హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌ దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయాన్నే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.

భాగ్యనగర్‌లో బోనాల సందడి
X

హైదరాబాద్‌లో ఆదివారం బోనాల సందడి నెలకొన్నది. లాల్‌ దర్వాజలో సింహవాహిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు.తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్దసంఖ్యలో మహంకాళీ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి వక్రమార్క అమ్మవారికి పట్టువస్త్రాలు సమ్పరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఛార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంబర్‌పేటలో మహాకాళి అమ్మవారికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లాల్‌ దర్వాజ బోనాల ఉత్సవాలకు 116 ఏళ్ల చరిత్ర ఉన్నది. వందేళ్లుగా ఏటా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారికి వొడి బియ్యాన్ని తొట్టెలను సమర్పిస్తుంటారు. అమ్మవారికి తల్లిగా భావిస్తారు కాబట్టి పసుపు, కుంకుమలు, బోనంతో పాటు వొడి బియ్యాన్ని సమర్పిస్తే అమ్మవారు చల్లగా చూస్తారని భక్తుల విశ్వాసం. రంగు రంగు కాగితాలతో తయారు చేసే తొట్టెలను సమర్పిస్తే ఆ తల్లి ఇంట్లో పిల్లలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని భక్తులు నమ్ముతుంటారు.

Raju

Raju

Writer
    Next Story