నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బీజేవైఎం ఆందోళన

గ్రూప్‌ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్‌-1 1:100 చొప్పున అభ్యర్థులకు మెయిన్స్‌ రాసే అవకాశం కల్పించాలనే డిమాండ్‌లతో బీజేవైఎం టీజీపీఎస్సీ కార్యాలయంముట్టడికి...

నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్సీ కార్యాలయం ముందు బీజేవైఎం ఆందోళన
X

మెగా డీఎస్సీ వేస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు పోస్టులు పెంచి పరీక్ష నిర్వహించాలని, గ్రూప్‌ 2,3 పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్‌-1 1:100 చొప్పున అభ్యర్థులకు మెయిన్స్‌ రాసే అవకాశం కల్పించాలని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.బీజేవైఎం టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా పోలీసులకు,బీజేవైఎం కార్యకర్తలు, నాయకుల మధ్య తోపులాట జరిగింది.

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీజేవైఎం చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. ఆందోళన దృష్ట్యా పోలీసులు అప్రమత్తమై నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరుద్యోగుల ఆశలన్నీ అడియాశలుగా మారుతున్నాయని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే రానున్న రోజుల్లో పోరాటన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన యువమోర్చా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Raju

Raju

Writer
    Next Story