గనులపై రాయల్టీ బకాయిలపై రాష్ట్రాలకు భారీ విజయం

ఖనిజ భూములు, గనులపై రాయల్టీ వాపసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలోరాష్ట్రాలకు భారీ విజయం దక్కింది.

గనులపై రాయల్టీ బకాయిలపై రాష్ట్రాలకు భారీ విజయం
X

ఖనిజ భూములు, గనులపై రాయల్టీ వాపసు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలోరాష్ట్రాలకు భారీ విజయం దక్కింది. కేంద్రం, గనుల కంపెనీలు ఇవ్వాల్సిన బకాయిలను రానున్న 12 ఏళ్లలో దశలవారీగా చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే విటిపై ఎలాంటి పెనాల్టీలను విధించవద్దని రాష్ట్రాలను ఆదేశించింది. 2005 నుంచి రాయల్టీ బకాయిలను రాష్ట్రాలు కేంద్రం నుంచి కోరవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రాయల్టీపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఈ ఏడాది జులై 25 నుంచే అమలు చేయాలన్న కేంద్రం అభ్యర్థలను సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.

ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్రానికి మాత్రమే ఉన్నదని 1989లో సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం గనులు, ఖనిజాలపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని, కేంద్రానికి ఆ హక్కు లేదని జులై 25న 8-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును 1989 నుంచి వర్తింప చేయాలన్న రాష్ట్రాల డిమాండ్‌ ను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించింది. రాయల్టీ వాపస్‌ ఇస్తే ఒక్క ప్రభుత్వ రంగ కంపెనీలే రూ. 70,000 కోట్లు తిరిగి చెల్లించాల్సి వస్తుందని.. దానివల్ల ప్రభుత్వ రంస్థ సంస్థలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిపింది. ఈ తీర్పును గత నెల 25 నుంచి వర్తింప చేయాలన్న కేంద్ర అభ్యర్థ ను తిరస్కరిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువరించింది. ఈ తీర్పుతో బెంగాల్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిషా వంటి రాష్ట్రాలకు భారీగా ప్రయోజనం చేకూరనున్నది.

Raju

Raju

Writer
    Next Story