వైదొలిగిన బైడెన్‌.. కమలా హారిస్ మద్దతు

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని కొన్నిరోజులుగా చెప్తూ వస్తున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఎట్టకేలకు వైదొలిగాడు.

వైదొలిగిన బైడెన్‌.. కమలా హారిస్ మద్దతు
X

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని కొన్నిరోజులుగా చెప్తూ వస్తున్న డెమోక్రటిక్‌ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ ఎట్టకేలకు వైదొలిగాడు. ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో బైడెన్‌ తేలిపోవడంతో సొంతపార్టీలోనే ఆయనపై అభ్యర్థిత్వంపై అసంతృప్తి నెలకొన్నది. రోజూ సొంతపార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా వైదొలుగుతున్నట్లు బైడెన్‌ ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. లేఖలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు చెప్పిన బైడెన్‌.. ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు.ఆ తర్వాత సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. నేడు నా పూర్తి మద్దతు హారిస్‌కు ఇస్తున్నాను. ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తున్నాను డెమోక్రాట్లు ఐక్యంగా ట్రంప్‌ను ఓడించండి అంటూ పేర్కొన్నారు.

డెమోక్రటిక్‌పార్టీ సీనియర్‌ నేత మాజీ హౌజ్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ బైడెన్‌పై నేరుగా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆయన ఓడించలేరని చెప్పారు. అంతేకాకుండా బైడెన్‌ అధ్యక్ష బరిలో కొనసాగితే ప్రతినిధుల సభలోనూ డెమోక్రట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విజయావకాశాలు తగ్గిపోయాయని అన్న ఒబామా పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్టు వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో వార్తలు వచ్చాయి.

మొన్నటివరకు తనను వైదొలగాలన్న డెమోక్రాట్లపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన బైడెన్‌ చివరికి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే మిగిలి ఉండటంతో బరిలో ఎవరు నిలుస్తారన్న ఉత్కంఠ నెలకొన్నది. బైడెన్‌ కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించినా ఆమెకు సీనియర్ల నుంచి పోటీ ఎదురవుతున్నది.

Raju

Raju

Writer
    Next Story