వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ప్రారంభమైంది. స్వామి, అమ్మవార్ల కల్యాణ హోత్సవానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం
X

బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతున్నది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవారి కల్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా సాగుతున్నదన్నారు. కల్యాణ మహోత్సవ ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్యాలు లేకుండా చూడాలని అమ్మవారిని మొక్కుకున్నానని చెప్పారు. పంటలు బాగాపండాలని కోరుకున్నారు. దేవాలయ అభివృద్ధికి కేంద్ర తరఫున రూ. 4.5 కోట్లు మంజూరు చేశామన్నారు. త్వరలో ఆ నిధులకు సంబంధించి అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.

ఎలమ్మ అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కూడా అమ్మవారి కల్యాణానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం, మేయర్‌ విజయలక్ష్మీ అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్‌ పాటించలేదని కలెక్టర్‌ అనుదీప్‌పై పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ప్రోటోకాల్‌ పాటించలేదని మంత్రి కొద్దిసేపు అలిగి బైటనే ఉండిపోయారు.

Raju

Raju

Writer
    Next Story