కవితకు బెయిల్‌..బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటికీ విజయం: బండి

కవిత బెయిల్‌పై ఎక్స్‌లో స్పందించిన కేంద్రమంత్రి సంజయ్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై సెటైర్లు వేశారు.

కవితకు బెయిల్‌..బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటికీ విజయం: బండి
X

కవిత బెయిల్‌పై ఎక్స్‌లో స్పందించిన కేంద్రమంత్రి సంజయ్‌ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై సెటైర్లు వేశారు. కవితకు బెయిల్‌ రావడమనేది బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండింటికీ విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి బెయిల్‌ లభించినందుకు కాంగ్రెస్‌ పార్టీకి, ఆపార్టీ న్యాయవాదులకు అభినందనలు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అలుపెరగని ప్రయత్నాలు ఫలించాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ లీడర్‌ బెయిల్‌పై బయటకు కాంగ్రెస్‌ నేతకు రాజ్యసభ సీటు అని తెలిపారు. బెయిల్‌ కోసం వాదించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కేసీఆర్‌ రాజకీయ చతురత అని సంజయ్‌ విమర్శలు చేశారు.





Raju

Raju

Writer
    Next Story