మహిళ జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు.. డీజీపీకి ఫిర్యాదు చేసిన కేటీఆర్

రాష్ట్ర డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ జితేంద‌ర్‌ను బీఆర్ఎస్ నాయ‌కులు క‌లిశారు. తుంగ‌తుర్తి రైతుల‌పై, నిన్న సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిప‌ల్లిలో జ‌ర్న‌లిస్టుల‌పై జ‌రిగిన దాడుల‌పై డీజీపీకి మాజీ కేటీఆర్ ఫిర్యాదు చేశారు.

ktr
X

హైదరాబాద్ డీజీపీ ఆఫీసులో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ నాయ‌కులు శుక్ర‌వారం క‌లిశారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిప‌ల్లిలో ఇద్దరు మహిళల జ‌ర్న‌లిస్టుల‌పై సూర్యాపేట జిల్లా తుంగతుర్తి రైతులపై జ‌రిగిన దాడుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేశారు. దాడుల‌కు పాల్ప‌డ్డ వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బీఆర్ఎస్ నేత‌లు డిమాండ్ చేశారు నిన్న కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ కవరేజ్ కోసం వెళ్లిన మహిళా జర్నలిస్ట్‌ల‌పై దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. దోషులను గుర్తించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కూడా డీజీపీని క‌లిసి వినతి పత్రం అంద‌జేశారు.

కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత ఊరయిన నాగర్ కర్నూల్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి వెళ్లిన మహిళా జర్నలిస్టులపై పట్టపగలే దాడి జరిగింది. కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 150 మంది వారిని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ మీకేం పని అంటూ దౌర్జన్యానికి దిగారు. వారు రికార్డు చేసిన దృశ్యాలు బయటకు రాకుండా మెమొరీ కార్డులు లాక్కున్నారు. పట్టపగలు సినిమాల్లోని వీధి గూండాలను తలపించారు. పోలీస్‌ స్టేషన్‌లోనే ఒక వ్య‌క్తి.. జర్నలిస్టుల్లో ఒకరిపై దాడికి యత్నించాడు. అయినా పోలీసులు చోద్యం చూశారు. దీంతో బాధిత జర్నలిస్టులు శుక్రవారం డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు.కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు జ‌గ‌దీశ్ రెడ్డి, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంక‌టేశ్‌తో పాటు ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story