కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్ల నిరసన

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వేతనాలు రూ.18 వేలు పెంచాలని డిమాండ్

కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆశావర్కర్ల నిరసన
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశావర్కర్ల వేతనాలను రూ.18వేలకు పెంచుతామని మయ మాటలు చెప్పారని ఆశావర్కర్ల ఆవేదన వ్యక్తం చేశారు.హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా హామీని తుంగలో తొక్కారని వారు తెలిపారు.

కనీసం జీతాల పెంపు గురించి కనీసం ప్రస్తావన లేదని వాపోయారు. ఆశావర్కర్ల నిరసనతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు రూ.18వేల శాలరీ పెంచాలని డిమాండ్ చేశారు. కొత్త ఆశావర్కర్ల నియామకాలను వెంటనే చేపట్టాలని అన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖున ఆశా వర్కర్లకు జీతాలు చెల్లించాలన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో డీఎంఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

Vamshi

Vamshi

Writer
    Next Story