హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉంది.. మరి కూల్చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Owiasi
X

హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్‌టీఎల్‌లో ఉంది.. మరి కూల్చేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ ధారుసల్లాంలో ఓవైసీ మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రభుత్వ భవనాలను బఫర్‌జోన్‌లో కట్టారని ఆ బిల్డంగ్‌లను కూల్చివేస్తారని రేవంత్‌ని నిలదీశారు. గోల్కొండ లో కూడా గోల్ఫ్ కోర్టు ఎఫ్‌టీఎల్‌లో ఉందని తెలిపారు. ఆ గోల్ఫ్ కోర్టులో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గోల్ఫ్ ఆడుతారని తెలిపారు.

అక్కడికి వెళ్లి చూడండి.. లేదంటే ఆ నేను ఫోటోలు కావాలంటే నేను ఇస్తానని ఓవైసీ ప్రకటించారు. వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా బీజేపీ బిల్లు ప్రవేశపెడుతుందని ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లీంలను లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. మజీద్లు, దర్గాల లాగే.. వక్ఫ్ ఆస్తులు కూడా ప్రభుత్వ ప్రాపర్టీ కాదని.. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ప్రాపర్టీ కి డీడ్ ఎలా ఉంటుందని.. మక్కా మసీదు కు డీడ్ కావాలంటే ఎక్కడ తేవాలని..ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందువులను పెట్టాలని చూస్తొందని.. అలా చేయడం సరికాదని.. ఓవైసీ మండిపడ్డారు.

Vamshi

Vamshi

Writer
    Next Story