సచివాలయం ముట్టడికి వస్తున్న సర్పంచుల అరెస్ట్‌

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయం ముట్టడికి వస్తున్న సర్పంచులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటూ అరెస్టు చేస్తున్నారు.

సచివాలయం ముట్టడికి వస్తున్న సర్పంచుల అరెస్ట్‌
X

ఎన్నికలకు ముందు సర్పంచుల సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్‌ బిల్లులు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌ సర్కార్‌ మాట తప్పింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అయినా సమస్యలు పరిష్కరించకపోవడంతో సర్పంచులు రోడ్డెక్కారు. పెండింగ్‌ బిల్లులు చెల్లంచాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయ ముట్టడికి బయలు దేరారు. కానీ ప్రజా ప్రభుత్వం ఇప్పుడు ప్రశ్నించడం, హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయం నేరం. అందుకే సచివాలయం ముట్టడికి వస్తున్న సర్పంచులను పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటూ అరెస్టు చేస్తున్నారు.

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సచివాలయం ముట్టడికి రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస పిలుపునిచ్చింది. ఈ మేరకు సచివాలయం వైపు ర్యాలీగా వస్తున్న సర్పంచులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడిక్కడక అరెస్టు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం ఐకాస అధ్యక్షుడు యాదయ్య గౌడ్‌ మాట్లాడుతూ.. 2019-24 మధ్య పెండింగ్‌ బిల్లలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అప్పుల బాధలు తాళలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలలు అయినా మా సమస్యలు పరిష్కరించలేదు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని పెండింగ్‌ బిల్లలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story