సీఎం ఢిల్లీ చుట్టూ పర్యటనలే తప్పా ఒక్క పథకం అమలు లేదు: వంటేరు

సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయింది. ఈ ఏడు నెలల కాలంలో కోట్ల రూపాయల అప్పులు చేశారు గానీ ఒక్క కొత్త పథకాన్ని అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు.

సీఎం ఢిల్లీ చుట్టూ పర్యటనలే తప్పా ఒక్క పథకం అమలు లేదు: వంటేరు
X

రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నది, ఈ ఏడు నెలల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడం, పదవుల కోసం పైరవీలు చేయడం తప్పా మరొకటి లేదని అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి గత ప్రభుత్వం పై నిందలు వేయడం తప్ప పరిపాలన పై దృష్టి పెట్టడం లేదన్నారు. గత ఏడు నెలలుగా అప్పులు చేయడం తప్ప కొత్త పథకం ఒక్కటీ అమలు చేయకపోగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన పథకాలు అమలు చేయలేదన్నారు.

38 వేల కోట్లు అప్పు తెచ్చారని, ఒక్క కొత్త పథకం అమలు చేయలేదు. రైతులకు రుణమాఫీ లేదు,రైతు బంధు లేదు, రైతు బీమా లేదని, రోజూ 8 కరెంటు కోతలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్తున్నదని రాష్ట్ర ప్రభుత్వ పనితీరునుపై వంటేర్‌ ధ్వజమెత్తారు.కాంగ్రెస్‌ నేతలు వాళ్ళ ఆదాయం పెంచుకుంటున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం మాత్రం పెంచడం లేదు. ఎమ్మెల్యేలు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రతి నెల అధికారులను మార్చుతున్నారని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వ పెద్దలకు ఏ అంశంపై అవగాహన లేదు, నిర్దిష్టమైన ప్రణాళిక లేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం లో అప్పులు తెచ్చి సాగు నీటి ప్రాజెక్టు లను నిర్మించామని చెప్పారు. ఇవాళ మల్లన్న సాగర్ లో నీళ్లు లేవు. కొండపోచమ్మ సాగర్ లో నీరు అడుగంటుతున్న పరిస్థితి నెలకొన్నదన్నారు. రంగనాయకసాగర్ ఎండిపోయింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమం లో భాగంగా అడవుల విస్తీర్ణం పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ అడవులు అంతరించిపోతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం దివాళా అంచులో ఉంది. ప్రతి నెల ఆదాయం 13 వేల కోట్ల ఆదాయం రావాలి. కానీ గత నెల 10 వేల కోట్లు మాత్రమే వచ్చిందంటే దివాలలో ఉన్నట్లే కదా అని ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ రంగం దివాళా తీసింది. ఇతర రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే మన రాష్ట్రంలో మాత్రం తగ్గడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కాదా అని నిలదీశారు. అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు.ఈ ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆంధ్రలో రియల్ ఎస్టేట్ పుంజుకుంది అక్కడ వ్యాపారం బాగా పెరిగిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలిస్తే ఊరుకుంటామా అన్న సీఎం వ్యాఖ్యలకు వంటేరు కౌంటర్‌ ఇచ్చారు.మీ ప్రభుత్వం ను కూల్చడానికి ఎవరు సిద్ధంగా లేరని, ముందు ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story