డ్రగ్స్‌ కట్టడికి హైస్కూళ్ల లో ప్రహరీ క్లబ్‌లు

హైస్కూళ్ల డ్రగ్స్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నది. హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.

డ్రగ్స్‌ కట్టడికి హైస్కూళ్ల లో ప్రహరీ క్లబ్‌లు
X

హైస్కూళ్ల డ్రగ్స్‌ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నది. హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. స్కూళ్లు, పిల్లల సంరక్షణ కేంద్రాలలో డ్రగ్స్‌ అమ్మకాలు జరగకుండా, విద్యార్థుల వాటి బారిన పడకుండా ప్రహరీ క్లబ్‌ను నిఘా పెడుతాయి.

పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ప్రిన్సిపల్‌ ప్రహరీ క్లబ్‌కు నేతృత్వం వహిస్తారు. పిల్లలతో సన్నిహితంగా ఉండే ఒక ఉపాధ్యాయుడు, తల్లిదండ్రుల నుంచి ఒకరు, స్థానిక పోలీస్ స్టేషన్‌ నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. 6-10 తరగతి వరకు ఒక్కో క్లాస్‌ నుంచి ఒక్కో విద్యార్థి ఇందులో సభ్యులుగా ఉంటారు. విద్యా సంస్థల్లోకి మత్తు పదార్థాలు చేరకుండా, విద్యార్థులు వాటి ఊబిలో చిక్కకుండా అవసరమైన ప్రణాళికలు ప్రహరీ క్లబ్‌కు రూపొందిస్తాయి. హైస్కూళ్లలో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో మరిన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Raju

Raju

Writer
    Next Story