దేవర నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో దుమ్మురేపిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్డీఆర్ హీరోగా జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది.

Devara movie
X

యంగ్ టైగర్ ఎన్డీఆర్ హీరోగా జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. ఫుల్ జోష్ ఉండే స్టెప్‍లతో దుమ్మురేపారు ఎన్టీఆర్ . హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అదరగొట్టారు. తారక్ డ్యాన్స్ ఇరగదీశారు. ఈ పాట పక్కా డ్యాన్స్ నంబర్‌గా ఉంది. ఫాస్ట్ బీట్‍తో ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.

దావుదీ సాంగ్ లిరికల్ వీడియోలా కాకుండా వీడియో సాంగ్‍నే మూవీ టీమ్ విడుదల చేసింది. ఎన్టీఆర్ డ్యాన్స్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సాంగ్ వైరలవుతుంది. ఇప్పటీకే విడుదలైన చుట్టమల్లే సాంగ్‌కు ఫుల్ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. దేవర మూవీ ఈ నెల 27న విడుదల కానుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story