'దేవర' మూవీ నుంచి మరో లేటెస్ట్ ఆప్‌డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ కాంబోలో వస్తున్న మూవీ ‘దేవర’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది.

Devara movie
X

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ కానుంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ దేవర అని ట్వీట్ చేయగా అతి త్వరలో అని టీమ్ దానికి రిప్లై ఇచ్చింది. ఈ పాట రొమాంటిక్ మెలోడీగా ఉంటుందని సమాచారం. కాగా సెప్టెంబర్ 27న దేవర సినిమా విడుదల కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ చిత్రంగా ‘దేవర’ రూపొందుతుంది. ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న రెండో చిత్రం కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇప్పుడు సెకండ్ సాంగ్ కు సంబంధించి హింట్ ను ఇచ్చారు మేకర్స్.

ఈసినిమా ఆడియో రైట్స్ ను సొంతం చేసుకున్న టీ సీరిస్ వారు తమ ట్విట్టర్ ద్వారా దేవర సాంగ్ కు సంబంధించి హింట్ ను ఇచ్చారు. అంతేకాకుండా లవ్ సింబల్ ఉన్న స్టికర్స్ పెట్టడంతో సెకండ్ సాంగ్ లవ్ సాంగ్ అయి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story