హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం: సీఎం

రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం: సీఎం
X

ప్రముఖ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు ఆర్థిక సాయంతో పాటు ఇంటి స్థలం కేటాయించామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. శాసససభ బడ్జెట్‌ సమావేశా్లలో ఆయన మాట్లాడుతూ.. 'సిరాజ్‌కు విద్యార్హత లేకున్నా గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తున్నామని చెప్పారు.

రాష్ట్రంలో త్వరలో క్రీడా విధానం తెస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం హర్యానా క్రీడా విధానాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో మరో క్రికెట్‌ మైదానం వస్తుందని వెల్లడించారు.ఎల్బీ స్టేడియంలో క్రీడలు తగ్గాయని, రాజకీయ కార్యకలాపాలు పెరిగాయన్నారు. యూసుఫ్‌గూడ, గచ్చిబౌలి, సరూర్‌నగర్‌ స్టేడియాల్లో క్రీడలు తగ్గాయని వివరించారు. హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ స్టేడియం వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ సమీపంలో అంతర్జాతీయ స్టేడియం ఉంటుందని పేర్కొన్నారు. బ్యాగరి కంచెలో స్ట్రేడియం నిర్మాణానికి బీసీసీఐతో చర్చించామని వెల్లడించారు. క్రీడల కోసం బడ్జెట్‌లో రూ. 321 కోట్లు కేటాయించామని తెలిపారు. చదువులో మాత్రమే కాదని, క్రీడల్లోనూ రాణిస్తే కూడా ఉన్నత ఉద్యోగం వస్తుందని కుటుంబ గౌరవం పెరుగుతుందన్నారు.భూముల లభ్యత చూసి మండల కేంద్రాల్లో స్టేడియాలు నిర్మిస్తామని వివరించారు. తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టేందుకు తాము సిద్ధమన్నారు.

అంతకు ముందు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రానికి పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నిఖత్‌ జరీన్‌, మహమ్మద్‌ సిరాజ్‌కు గ్రూప్‌-1 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారు. సవరణ బిల్లుకు ఆమోదం తెలపాలని విపక్ష పార్టీలను కోరారు. నిఖత్‌, సిరాజ్‌ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తెచ్చారని ఎంఐఎం సభ్యులు పేర్కొనగా.. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని బీజేపీ సభ్యులు సూచించారు.

Raju

Raju

Writer
    Next Story