వరద బాధితులకు పొంచి ఉన్న మరో ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది.

FLOODS
X

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి సొంతిళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. వరదలకు వచ్చిన బురద, చెత్తచెదారంతో దోమలు విజృంభించినున్నాయి. వీటి వల్ల డెంగీ, మలేరియా, చికున్‌ గున్యా వంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మరో పక్కన జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పుల వంటి లక్షణాలతో వైరల్‌ ఫీవర్స్‌ జనాలను వణికిస్తున్నాయి. వీటిని అరికట్టడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లేకుంటే ఆరోగ్య విపత్తు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

విషజ్వరాల బాధితులను పక్కన పెడితే వైరల్‌ ఫీవర్స్‌ కేసులు రోజురోజుకు తీవ్రంగా పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరల్‌ ఫీవర్స్‌ ఒకరి నుంచి మరొక్కరికి సోకుతుండటంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇంట్లో ఒక్కరికి వస్తే చాలు, ఇతర కుటుంబ సభ్యుంలందరూ విష జ్వరాలు బారిన పడుతున్నారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో ఈ వైరల్‌ ఫీవర్స్‌ ఒకరి నుంచి మరొక్కరికి వ్యాపిస్తున్నట్లు వైద్య నిపుణులు పేర్కొన్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story