తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rains
X

తెలంగాణలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 24 గంటల్లో వాయవ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొన్నాది. మరోవైపు ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ మేరకు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇవాళ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. తాజాగా వాతావరణ శాఖ చేసిన ప్రకటనతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే వరదల నుంచి తేరుకోలేకపోతున్నామని, మళ్లీ వర్షాలంటే ప్రాణాలు కూడా దక్కుతాయో లేదని భయాందోళన చెందుతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story