ప్లే స్కూల్ తరహాలో అంగన్ వాడీ కేంద్రాలు

ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ప్లే స్కూల్ తరహాలో అంగన్ వాడీ కేంద్రాలు
X

ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాలలోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్ వాడీలలో విద్యాబోధనకు అదనంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 3వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాల్లో ఆతరువాత 4వతరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గ్రామాల నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లేందుకు ప్రభుత్వమే రవాణ సదుపాయం కల్పించాలని తెలిపారు.ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల తో సమాంతరంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు.

విద్యా వేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక ఒకటిరెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వ నిధులతోపాటు సీఎస్ఆర్ ఫండ్స్ తో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను మరింత పటిష్టం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

Raju

Raju

Writer
    Next Story