స్కిల్స్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఆనంద్ మహింద్రా : సీఎం రేవంత్

తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాను నియమించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు

Cm revanth reddy
X

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోయే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రాను నియమించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికా న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో ఆనంద్ మహింద్రా బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం తెలిపారు. తొలిసారిగా పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని, యువతకు వివిధ ట్రేడ్‌లలో నైపుణ్యాన్ని నేర్పించడంతో కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు.

టెక్ మహింద్రా యూనివర్శిటీ స్నాతకోత్సవం సందర్భంగా నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మహింద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా సీఎం రేవంత్‌ని నివాసానికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరి మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల వివరాలు సీఎం రేవంత్ నోటి వెంట అమెరికా వేదికగా ప్రకటన రూపంలో వెలువడింది. రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్ పేటలో యూనివర్శిటీకి ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేశారు. 17 కోర్సులను అందుబాటులోకి రానున్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story