అంబానీ ఇంట పెళ్లి.. అతిథులకు 100 విమానాలు
అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లికి హాజరయ్యే అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ జెట్ లు సహా 100కుపైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు.
- By VamshiLoading...
- | 11 July 2024 9:15 AM GMT
X
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేపు జరిగే పెళ్లికి హాజరయ్యే అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ జెట్ లు సహా 100కుపైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు. తమ సంస్థ నుంచి ఫాల్కన్–2000 రకానికి చెందిన మూడు జెట్ విమానాలను అంబానీ కుటుంబం అద్దెకు తీసుకుందని క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా ప్రముఖ వార్తాసంస్థ ‘హిందుస్థాన్ టైమ్స్’కు పేర్కొన్నారు.
దేశం నలుమూలల నుంచి విచ్చేసే గెస్టులకు తీసుకొచ్చేందుకు ఒక్కో విమానం కొన్ని ట్రిప్పులు తిరగనుందని చెప్పారు. ఇందుకోసం 100కుపైగా ప్రైవేటు విమానాలు ఉపయోగించనున్నట్లు అంచనా వేశామన్నారు. జులై 12న ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించిన మొత్తం మెనూ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారణాశిలో అత్యంత ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ స్టాల్ వాళ్లు ఈ పెళ్లి విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ చాట్ బండార్ యజమానే స్వయంగా ముఖ్య అతిథుల (వీఐపీ)కు వడ్డించనున్నారట. కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరి, దహీ పూరి, బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ అంబానీ మెనూలో ఉన్నాయట.